ఎన్నారై దారుణహత్య
Published Thu, Feb 9 2017 3:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే అనుమానంతో ఓ ఎన్నారై వ్యక్తిని దారుణంగా హతమార్చి.. అనంతరం మృతదేహాన్ని తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడో ప్రబుద్ధుడు. వివరాలు.. ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్ ఇమ్రాన్(35) గత కొంత కాలంగా విదేశాల్లో స్థిరపడి ఈ మధ్యే నగరానికి తిరిగివచ్చాడు.
అతనికి ఫలక్‌నుమా రైతుబజార్ సమీపంలో నివాసముండే ఫాతీమాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు గుర్తించిన ఫాతీమ భర్త సయీద్ బారాబూద్ అతన్ని దారుణంగా హతమార్చి బండ్లగూడలోని హాషామాబాద్‌లోని తన ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఈ నెల 4న (శనివారం) ఇమ్రాన్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు లభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపగా విషయం బయటపడింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Advertisement
Advertisement