syed imran
-
ఎన్నారై దారుణహత్య
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే అనుమానంతో ఓ ఎన్నారై వ్యక్తిని దారుణంగా హతమార్చి.. అనంతరం మృతదేహాన్ని తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడో ప్రబుద్ధుడు. వివరాలు.. ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్ ఇమ్రాన్(35) గత కొంత కాలంగా విదేశాల్లో స్థిరపడి ఈ మధ్యే నగరానికి తిరిగివచ్చాడు. అతనికి ఫలక్‌నుమా రైతుబజార్ సమీపంలో నివాసముండే ఫాతీమాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు గుర్తించిన ఫాతీమ భర్త సయీద్ బారాబూద్ అతన్ని దారుణంగా హతమార్చి బండ్లగూడలోని హాషామాబాద్‌లోని తన ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఈ నెల 4న (శనివారం) ఇమ్రాన్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు లభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపగా విషయం బయటపడింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
నీటిగుంటలో పడి చిన్నారులు మృతి
అదిలాబాద్ : ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిగుంటలో పడి మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా భైంసాలో ఆదివారం వెలుగు చూసింది. స్థానిక బైపాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్ (12), ముజమ్మిల్ ఖురేషి (9) శనివారం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. వారు మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో సమీపంలోని నీటికుంట వద్ద చిన్నారుల దుస్తూలు లభించాయి. స్థానికుల సాయంతో గుంటలో వెతకగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. సదరు చిన్నారులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గ్యాంగ్ రేప్ .. ఆపై బెదిరింపులు
- హైదరాబాద్ లో దారుణం హైదరాబాద్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు బెదిరించి రూ.లక్షల్లో వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ జసీం షరీఫ్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్ మరికొందరు కలసి ఇటీవల ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె ఫొటోలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. వాటిని చూపి బాధితురాలిని బెదిరిస్తూ నగలు, నగదు కలిసి రూ.30 లక్షల వరకు వసూలు చేశారు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులైన అహ్మద్ జసీం షరీఫ్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.