శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని తిరుమల వైన్స్ ఎదురుగా మధు (30) అనే వ్యక్తిని తలపై రాయితో మోది చంపేశారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.