one murdered
-
చిన్నపాటి గొడవ.. 20 కత్తిపోట్లు!
హైదరాబాద్: చిన్నపాటి గొడవ కారణంగా ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. బహదూర్‌పురా రామ్నాస్పురా ప్రాంతానికి చెందిన మన్సూర్ ఖాన్(42) జూపార్కు సమీపంలో ఖాజా ఫంక్షన్ హాల్‌ను నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికే చెందిన ఖాలేద్ పిల్లలు, మన్సూర్ ఖాన్ పిల్లలతో గొడవ పడేవారు. ఈ చిన్నపాటి గొడవలు వారిద్దరి మధ్య తీవ్రస్థాయికి చేరాయి. అంతేకాక మన్సూర్ ఖాన్ ఆర్థికంగా ఎదుగుతుండటాన్ని ఖాలేద్ జీర్ణించుకోలేకపోయాడు. వీరి మధ్య ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని శనివారం మధ్యాహ్నం ఖాజా ఫంక్షన్ హాల్‌కు కొద్ది దూరంలో ఖాలేద్ తన అనుచరులతో కలిసి మన్సూర్‌ఖాన్‌పై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశాడు. ఈ దాడిలో 20 చోట్ల కత్తిపోట్లకు గురైన మన్సూర్ఖాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, అదనపు ఇన్స్పెక్టర్ గురునాయుడు, క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఎస్సై రవి కుమార్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్డేడియం సమీపంలో వ్యక్తి దారుణహత్య
హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక జ్యోతిరావు పూలే స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీసీపీ సాయి శేఖర్, ఏసీపీ శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అదిలాబాద్ జిల్లా ఇచోద గ్రామానికి చెందిన అశోక్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కత్తులతో దాడి.. వ్యక్తి దారుణహత్య
-
కత్తులతో దాడి.. వ్యక్తి దారుణహత్య
దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని తక్కెళ్లపాడులో కృష్ణయ్య అనే వ్యక్తిపై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో కృష్ణయ్య కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నారు. -
అప్పు డబ్బులు అడిగినందుకు వ్యక్తి హత్య
పాణ్యం(కర్నూలు జిల్లా): తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తిని వేటకొడవలితో నరికేశాడు. ఈ సంఘటన పాణ్యం మండలం కౌలూరులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. కౌలూరు గ్రామానికి చెందిన యేసఫ్(55) అనే వ్యక్తి వద్ద అదే గ్రామానికి చెందిన చెట్ల గోపాల్ సుమారు రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. ఎప్పుడు అడిగినా తర్వాత ఇస్తా అని సమాధానం ఇవ్వడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న గోపాల్.. నాకే నోటీసులు పంపిస్తావా అని తనతో తెచ్చుకున్న వేటకొడవలితో యేసఫ్‌ను నరికి హత్యచేశాడు. ఘటన అనంతరం నిందితుడు గోపాల్ అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తులతో దాడి.. వ్యక్తి దారుణ హత్య
వికారాబాద్(రంగారెడ్డి): రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తిని దారికాచిన దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డుపై మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని తిరుమల వైన్స్ ఎదురుగా మధు (30) అనే వ్యక్తిని తలపై రాయితో మోది చంపేశారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. -
హత్యకేసులో టీడీపీ నేతపై కేసు
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనలో టీడీపీ నేత పై కేసు నమోదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో వెంకటేశ్ ను శుక్రవారం వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపేశారు. ఈ హత్యపై అనుమానం ఉన్న స్థానిక టీడపీ నేత ప్రతాప్ నాయుడు సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరో వైపు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఈ హత్య చేయించారని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వేటకొడవళ్లతో నరికి చంపేశారు!
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. ఉరవకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేశారు. వెంకటేశ్ ను వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఈ హత్య చేయించారని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తప్పును తప్పని చెప్పాడు అంతే...
న్యాయం చేద్దామని వెళ్లి.. ఓ వ్యక్తి అన్యాయమైపోయాడు. నువ్వు చేసినది తప్పు.. అన్నందుకు ‘మరణశిక్ష’ అనుభవించాడు. మండలంలోని లంకలపల్లిపాలెంలో గురువారం హత్య జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొయ్య అప్పారావు తాటికల్లు కోసమని అదే ప్రాంతానికి చెందిన రీసు రాము చెట్టు వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ కల్లు గీస్తున్న రామును తాటికల్లు ఇవ్వాలని అడిగాడు. ఇది మధ్యాహ్నం సమయమని, కల్లు రావని రాము చెప్పాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం రేగింది. దీంతో అప్పారావు తన వద్ద ఉన్న కత్తితో చెట్టు ఎక్కి తాటికొమ్మలు నరకసాగాడు. సమీపంలో ఉన్న అదే గ్రామానికి చెందిన పెసల నర్సింహులు అక్కడకు చేరుకుని అప్పారావును మందలించాడు. కల్లు ఇవ్వలేదని గొడవపడి కమ్మలు నరకడం మంచి పద్ధతి కాదని హితవు పలికాడు. అక్కడ నుంచి అప్పారావు కోపంతో సమీపంలో గొర్రెలు కాస్తున్న నక్కాన అప్పన్న(55) వైపు వెళ్లాడు. ‘నువ్వు చేసింది తప్పు. కల్లు ఇవ్వలేదని చెట్టు కొమ్మలు నరకడం సరికాదు.’ అంటూ అప్పారావును అప్పన్న మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన అప్పారావు.. తన వద్ద ఉన్న కత్తితో నక్కాన అప్పన్న చేతిలోని కర్రను ముందుగా నరికాడు. ఆ తర్వాత అప్పన్న మెడపై కత్తితో వేటు వేశాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకుంటున్నా చలించలేదు. సమీపంలో ఉన్న అప్పన్న కుమారుడు అప్పలనాయుడు పరుగున అక్కడకు వచ్చాడు. అతనిపైనా అప్పారావు కత్తితో దాడికి దిగి, గాయపరిచాడు. కళ్ల ముందే రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న తండ్రిని చూసి అప్పలనాయుడు భయాందోళనకు గురై, గ్రామంలోకి పరుగు తీశాడు. గ్రామస్తులను తీసుకొచ్చాడు. అప్పటికే అప్పన్న మృతి చెందాడు. మృతుడు అప్పన్నకు భార్య బంగారమ్మతోపాటు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృతి చెందడంతో వారంతా భోరుమన్నారు. విషయం తెలుసుకున్న భోగాపురం సీఐ ఎ.ఎస్.చక్రవర్తి, ఎస్సై షేక్ ఫక్రుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.