పాక్‌కు తప్పదు గుణపాఠం | Pakistan needs a lesson | Sakshi
Sakshi News home page

పాక్‌కు తప్పదు గుణపాఠం

Published Mon, Sep 19 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

పాక్‌కు తప్పదు గుణపాఠం

పాక్‌కు తప్పదు గుణపాఠం

అబిడ్స్‌: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు తుది ఘడియలు సమీపిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోధా పేర్కొన్నారు. కాశ్మీర్‌లో భారత్‌ జవాన్లపై జరిపిన దాడిని నిరసిప్తూ పురానాపూల్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా ఆధ్వర్యంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాబ్‌ షరీఫ్‌ దిష్టిబొమ్మను తగలపెట్టారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


ఉగ్రదాడిని ఖండిస్తూ...
సాక్షి, సిటీబ్యూరో: కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌లపై పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దిష్టిబొమ్మను దహనం చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, మాజీ ఎంఎల్‌ఏలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్, ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement