నెటిజన్ల మదిలో సన్నీలియోన్ | people Most searches to Sunny Leone | Sakshi
Sakshi News home page

నెటిజన్ల మదిలో సన్నీలియోన్

Published Thu, Dec 24 2015 11:48 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

నెటిజన్ల మదిలో సన్నీలియోన్ - Sakshi

నెటిజన్ల మదిలో సన్నీలియోన్

సిటీబ్యూరో:  అందాల తార సన్నీలియోన్ హైదరాబాదీ నెటిజన్ల మనసు దోచుకుంది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్... 2015వ సంవత్సరానికి అత్యధిక సెర్చ్‌లు (శోధనలు) దక్కిన స్థలాలు, సినిమాలు, సెలబ్రిటీల తాజా లెక్కలను (సెర్చ్ రిజల్ట్స్)ను గురువారం విడుదల చేసింది. ఇందులో నగరానికి సంబంధించి ఆసక్తికర అంశాలున్నాయి. నగరంలో అత్యధికులు శోధించిన ప్రాంతాల్లో పీవీఆర్ సిని మాస్ (ఐ మ్యాక్స్ థియేటర్) అగ్రస్థానంలో నిలిచింది. సిని మాల్లో ‘బాహుబలి’ నెటిజన్ల మనసు దోచుకున్నట్లు తేలింది. ఇక టాప్ సెలబ్రిటీలలో సన్నీలియోన్ నిలవడం విశేషం. హైదరాబాద్ ఆణిముత్యం సానియా మీర్జా క్రీడాకారుల జాబితాలో ఏడోస్థానంలో నిలిచింది. నగరంలో జాబితా ఇలా ఉంది....
 
 ‘బాహుబలి’కి శోధకులు ఎక్కువే..  ఇక దేశవ్యాప్తంగా రికార్టు సృష్టించిన బాహుబలి చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు అత్యధికులు నెట్‌లో శోధించినట్లు గూగుల్ సంస్థ ఉపాధ్యక్షులు, మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ ఆనందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినివూ పదో స్థానంలో నిలిచిందన్నారు.

http://img.sakshi.net/images/cms/2015-12/71450981923_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement