స్మితా సభర్వాల్‌కు నిధుల విడుదలపై కోర్టులో పిటిషన్ | petition in the4 court on smitha sabarwal | Sakshi
Sakshi News home page

స్మితా సభర్వాల్‌కు నిధుల విడుదలపై కోర్టులో పిటిషన్

Published Thu, Sep 3 2015 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

petition in the4 court on smitha sabarwal

హైదరాబాద్: 'ఔట్‌లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు దాఖలు చేశారు. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డెరైక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్ జనరల్, స్మితాసబర్వాల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. స్మితా సబర్వాల్ ఓ హోటలో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి సదరు పత్రిక కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమని, దీని వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినలేదని పిటిషనర్ తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement