ఫీజులు పెంచకుంటే పీజీ సీట్ల ఉపసంహరణ | PG Seats withdrawal if without raising fees | Sakshi
Sakshi News home page

ఫీజులు పెంచకుంటే పీజీ సీట్ల ఉపసంహరణ

Published Tue, Apr 11 2017 2:25 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

ఫీజులు పెంచకుంటే పీజీ సీట్ల ఉపసంహరణ

ఫీజులు పెంచకుంటే పీజీ సీట్ల ఉపసంహరణ

- ప్రభుత్వానికి ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అల్టిమేటం
- ఎన్‌ఆర్‌ఐ కోటా సృష్టించి రూ.60 లక్షల ఫీజు పెంపునకు డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. పీజీ వైద్య ఫీజులను పెంచకుంటే ఆయా సీట్లన్నింటినీ తాము ఉపసంహరించుకుంటామని హెచ్చరించాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్య సంఘం లేఖ ఇచ్చింది. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని పీజీ వైద్య సీట్లలో 50% కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన 50% యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ పద్ధతిని మార్చాలని డిమాండ్‌ చేశాయి.

ఇక నుంచి కన్వీనర్‌ కోటా 50% సీట్లలో ఎలాంటి మార్పు అవసరం లేదని, మిగిలిన వాటిల్లో 25% బీ కేటగిరీగా, మరో 25% ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లుగా మార్పు చేయాలని కోరాయి. కన్వీనర్‌ కోటా, బీ కేటగిరీ సీట్లను ఉమ్మడి కౌన్సె లింగ్‌ ద్వారా, 25% ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సొంతంగా భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పిం చాలని కోరాయి. ప్రస్తుతం క్లినికల్‌ కన్వీనర్‌ కోటా సీటుకు రూ.3.2లక్షల ఫీజుండగా, దాన్ని రూ.12 లక్ష లకు పెంచాలని డిమాండ్‌ చేశాయి. అలాగే యాజమాన్య కోటా సీట్లకు రూ.5.8 లక్షలున్న సంగతి తెలిసిందే. వీటిని విభజించి బీ కేటగిరీ సీట్లకు రూ.25 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పెంచాలని కోరాయి.

లేఖ ఇచ్చిన మాట వాస్తవమే...
యాజమాన్యాలు కోరుతున్నట్లు 25 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సృష్టిస్తే ఆ ప్రకారం 115 సీట్లు సొంతంగా భర్తీ చేసుకోవడానికి వీలవు తుంది. వాటికి ఏడాదికి రూ.60 లక్షల వరకు అంటే మూడేళ్లలో ఒక్కో సీటుకు రూ.1.8 కోట్లు వసూలు చేసే అవకాశం కలుగుతుంది. తాము కోరినట్లుగా ఎన్‌ఆర్‌ఐ కోటా సృష్టించడంతోపాటు ఫీజులు పెంచకుంటే ఈ ఏడాది పీజీ వైద్య సీట్లను కాలేజీల నుంచి ఉపసంహరించుకుంటామని ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారావు ‘సాక్షి’కి తెలిపారు.  

ఇరుకున పడిన ప్రభుత్వం...
రాష్ట్రంలో 8 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 460 క్లినికల్‌ పీజీ. 138 నాన్‌ క్లినికల్‌ సీట్లున్నాయి. క్లినికల్‌ సీట్లకే విద్యార్థుల నుంచి డిమాండ్‌ ఉంటుంది. నాన్‌ క్లినికల్‌ సీట్లు చాలాసార్లు భర్తీ కావు. క్లినికల్‌లో 50% అంటే 230 సీట్లు కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన 230 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. నీట్‌ ర్యాంకుల నేపథ్యంలో ఈసారి నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు సర్కారు ఏర్పాట్లు చేస్తుండటంతో మెడికల్‌ కాలేజీల యాజమా న్యాలు కంగుతిన్నాయి. ఇప్పటివరకు ఒక్కో యాజమాన్య పీజీ వైద్య సీటును డిమాండ్‌ను బట్టి రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకు డొనేషన్‌ వసూలు చేసేవి. ఉమ్మడి కౌన్సెలింగ్‌తో డొనేషన్‌కు చెక్‌ పడుతుండటంతో యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement