యాకుత్‌పురా: దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పాతబస్తీలోని స్విమ్మింగ్ పూల్‌లపై కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ పర్యవేక్షణలో చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్ నుమా, సంతోష్‌నగర్ డివిజన్లలో సెర్చ్ నిర్వహించారు. గత నెల 23వ తేదీన మదీనానగర్‌లోని వైఎస్‌పీ స్విమ్మింగ్ ఫూల్‌లో ఈతకు వెళ్లిన రిజ్వాన్ అనే యువకుడు మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు స్విమ్మింగ్ ఫూల్‌లపై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు రెయిన్‌బజార్ పీఎస్ పరిధి నుంచి ప్రారంభమైన ఈ సెర్చ్ రాత్రి వరకు కొనసాగింది.
రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలోని రెండుతో పాటు మొఘల్‌పురా, సలాల, బహదూర్‌పురా, ఖిల్వత్‌లోని మొత్తం 12 స్విమ్మింగ్ పూల్‌లలో సెర్చ్ నిర్వహించారు. ఐదు స్విమ్మింగ్ పూల్‌లలో సీసీ కెమెరాలు, కలుషిత నీరు, లైఫ్ జాకెట్లు లేవు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఐదు స్విమ్మింగ్ పూల్‌లను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న స్విమ్మింగ్ ఫూల్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
స్మిమ్మింగ్‌ఫూల్‌లపై పోలీసుల కార్డన్‌సెర్చ్
Published Wed, Jun 1 2016 10:59 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement