పోలీసుల కస్టడీకి సల్మాన్ | police taken salman Mohiuddin into custody | Sakshi
Sakshi News home page

పోలీసుల కస్టడీకి సల్మాన్

Published Thu, Jan 22 2015 11:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

పోలీసుల కస్టడీకి  సల్మాన్

పోలీసుల కస్టడీకి సల్మాన్

హైదరాబాద్: అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కు చెందిన తీవ్రవాది  సల్మాన్ మొహియుద్దీన్ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు తీర్పు మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. కాగా ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు వచ్చిన సల్మాన్ను  పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 సల్మాన్ మొహియుద్దీన్ గత ఏడాది సిరియా వెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. తాజాగా వీసా రావడంతో దుబాయ్ వెళ్లి ఐఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసమే ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి విచారణలో తాను ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నానని సల్మాన్ అంగీకరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 salman moinuddin, ISIS, dubai, hyderabadi engineer arrested, సల్మాన్ మొయినుద్దీన్, హైదరాబాదీ ఇంజనీర్ అరెస్టు, పేస్ బుక్, ఐఎస్ఐఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement