
సల్మాన్ మొయినుద్దీన్(ఫైల్)
హైదరాబాద్: తన కుమారుడు నిజాయితీపరుడని ఎలాంటి తప్పు చేయలేదని సల్మాన్ మొయినుద్దీన్ తండ్రి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ జేఎన్ టీయూలో బీటెక్ పూర్తిచేసి లండన్ లో ఎమ్మెస్ చేశాడని తెలిపారు. దుబాయ్ లో ఉద్యోగం కోసం వెళుతున్న తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వాపోయారు.
సల్మాన్ కు ఏడేళ్ల క్రితం వివాహం అయిందని పాప, బాబు ఉన్నారని తెలిపారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ ను తెలంగాణ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడు అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ శిక్షణ పొందినట్లు చెబుతున్నారు.