ఎల్బీనగర్లో స్కూల్ బస్సు బీభత్సం
హైదరాబాద్: ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలో శనివారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. శాంతినికేతన్ స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బీభత్సం సృష్టించింది.
డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. బస్సుకు ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.