సీఎం కేసీఆర్ మెడలు వంచేది ఓయూ విద్యార్థులే..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయకుంటే ఓయూ విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచుతారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ పే ర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచినట్లు విద్యార్థులు, నిరుద్యోగులు నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు. సీఎం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా త్వరలో ఓయూలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాం కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఇటికాల పురుషోత్తం, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు చారకొండ వెంకటేష్, మాందాల భాస్క ర్, బాబులాల్‌నాయక్, దురువు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీలను గాలికొదిలేశారు జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణాలోని విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో యూనివర్సిటీల బోర్డులే మిగులుతాయని రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం విద్యార్థుల ఆహ్వానం మేరకు ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు రెండేళ్లుగా పర్మినెంట్ వీసీలను నియమించనందున పాలనా వ్యవహారాలు పూర్తిగా స్తంభిం చాయన్నారు. ఓయూకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు రద్దు కావడంతో యూజీసీ నిధు లు రావడం లేదన్నారు. త్వరలో వం దేళ్లు జరుపుకోనున్న ఓయూకు రెండు సంవత్సరాలుగా పర్మినెంట్ వీసీ లేనందున ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పాలన కుంటుపడ్డాయన్నారు. ఇంచార్జి వీసీగా ఐఏఎస్ అధికారిని నియమించడంవల్ల ప్రతి సంతకానికీ సచివాలయం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విశ్వవిద్యాలయాల సమస్యలపై ఈ నెల 29న ఓయూలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులే పలికిస్తున్నాయి తప్ప ఎవరో చెబితే విని అం టున్న మాటలు కాదన్నారు. ప్రజా సంక్షే మం కోసం మాట్లాడితే తనను మం త్రులు విమర్శించడం దారుణమన్నారు.
సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధికి నిరంతరం ఉద్యమాలు జరుగుతూనే ఉం టాయన్నారు. ఓయూలో గల విద్యార్థి జేఏసీలు ఏకమై సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన సమ యం ఆసన్నమైందని నిజాం కాలేజీ అధ్యాపకులు డాక్టర్ ఇటికాల పురుషోత్తం పిలుపునిచ్చారు.