prof . Kodandaram
-
బీజేపీలో చేరికపై తొందరొద్దు..! ఊగిసలాటలో ఈటల...
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ రోజుకో మలుపు తిరుగుతోంది. దీనితో ఆయన తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెల కొంది. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గురు వారం జరిగిన రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమంటూ గురువారం బీజేపీ శిబిరం స్పష్టమైన సంకే తాలు ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విశాల రాజ కీయ వేదిక నిర్మాణం కోసం కలసి పనిచేద్దా మంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి ఈటల ఇప్పటికే తన సన్నిహితులకు చూచాయగా వెల్లడించారు. రాజకీయంగా తనను అణగదొక్కడంతో పాటు భూకబ్జా కేసుల్లో కుటుంబసభ్యులను కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో బీజేపీలో చేరేందుకే ఈటల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆయన ఆ పార్టీ జాతీయ నాయకులతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన చేరికకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని సమాచారం. బీజేపీలో చేరికపై తొందరొద్దు! ఈటల బీజేపీలో చేరతారంటూ రెండు రోజులుగా వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం షామీర్పేటలోని ఈటల నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ రాజకీయ వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఈటలకు నైతిక మద్దతునిచ్చేందుకే వచ్చినట్లు కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఈటలతో జరిగిన అంతర్గత భేటీలో మాత్రం బీజేపీలో చేరిక, విశాల రాజకీయ వేదిక వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరికపై తొందర పాటు నిర్ణయం వద్దని వివరించినట్లు తెలిసింది. బీజేపీలో చేరితే ఈటల రాజకీయ భవిష్యత్తుకు జరిగే నష్టం, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడంలో ఈటల పాత్ర, కలసి వచ్చే వారితో సమన్వయం చేసుకోవాల్సిన తీరుపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. బీజేపీ పచ్చజెండా? కొద్ది రోజులుగా ఈటల రాజేందర్‌తో వరుస మంతనాలు జరుపుతున్న బీజేపీ కీలక నేతలు ఆయన చేరికకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. ఈటల చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రాష్ట్ర ముఖ్య నేతలు అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఇదిలా ఉంటే గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన వర్చువల్ భేటీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తావించారు. ఈటల కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో నిరంతరం ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈటల చేరిక ముహూర్తం ఒకట్రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉండగా, ఢిల్లీలోనే ఈటల చేరిక కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అవినీతి ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీపై ధిక్కార స్వరం వినిపించారు. అంతర్గత అభిప్రాయ సేకరణ చేసిన పార్టీ తనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఊగిసలాటలో ఈటల తమ పార్టీలో ఈటల చేరడం ఖరారైందని బీజేపీ శిబిరం నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నా ఈటల మాత్రం చేరికకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు. భూ వివాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండటంతో బీజేపీలో చేరాలనే ఒత్తిడి కూడా ఈటలపై పెరుగుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరితో తనకు ఎవరు దూరం అవుతారానే కోణంలో ఈటల విశ్లేషించుకుంటున్నారు. బీజేపీలో చేరికపై బహిరంగ ప్రకటన చేయడానికి ముందు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో మరోమారు భేటీ కావాలనే యోచనలోనూ ఈటల ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినం జూన్ 2లోగా ఈటల భవిష్యత్ రాజకీయ ప్రస్తానంపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
రంగారెడ్డికి కృష్ణా, మంజీరా జలాలు అవసరం
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాకు కృష్ణ, మంజీరా జలాలు అవసరమని.. అయితే, ఇప్పటి వరకు ఆ జలాలు జిల్లాకు వస్తాయనే స్పష్టత రాలేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం ఎన్ని నీళ్లు రావాలో నిపుణులతో మాట్లాడి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్షం పడక 10 రోజులు అవుతుందని.. ఇలాగే ఉంటే పంట ఉంటుందో పోతుందో తెలియక రైతులు బాధ పడుతున్నారన్నారు. జిల్లాలో వ్యవసాయమే ఆధారంగా ప్రజలు జీవిస్తున్నారన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి నీళ్లు తేవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నీళ్ల విషయమై జేఏసీ ఎన్నోసార్లు సమావేశమై చర్చించిందన్నారు. జిల్లాకు రావాల్సిన నీటి విషయంపై జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆలోచన చేస్తామన్నారు. జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.రవీందర్ మాట్లాడుతూ. జేఏసీ ఒక లక్ష్యం కోసం పోరాటం చేసిందన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ çబాగు పడుతుందనుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏ లక్ష్యం కోసం ప్రతి ఒక్కరం కృషి చేశామో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజీత్‌మఠంలా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వికారాబాద్‌లో ఉద్యమాన్ని ఉత్వెత్తున నడిపామన్నారు. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబం ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రౌడీలతో దాడులు చేయించి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందులో చేరి మొత్తం కుటుంబం ఇప్పుడు పదవులు అనుభవిస్తుందన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఉద్యమ నాయకులపై హేళన చేస్తూ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యోగాన్ని, తండ్రిని కోల్పోయి చంద్రకాంత్‌రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడో ఇక్కడి విద్యార్థులకు తెలుసునన్నారు. మంత్రి వైఖరి మార్చుకోక పోతే మరో ఉద్యమానికి ఈ ప్రాంత విద్యార్థులు సిద్ధమని హెచ్చరించారు. అనంతరం ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్, సబ్‌కలెక్టర్ శృతిఓజాకు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కల్కోడ నర్సిములు, తాండూరు జేఏసీ చైర్మన్ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘాల నాయకుడు రాంరెడ్డి, పాండురంగం, వెంకటయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్ మెడలు వంచేది ఓయూ విద్యార్థులే..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయకుంటే ఓయూ విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచుతారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ పే ర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచినట్లు విద్యార్థులు, నిరుద్యోగులు నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు. సీఎం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా త్వరలో ఓయూలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాం కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఇటికాల పురుషోత్తం, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు చారకొండ వెంకటేష్, మాందాల భాస్క ర్, బాబులాల్‌నాయక్, దురువు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. వర్సిటీలను గాలికొదిలేశారు జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణాలోని విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో యూనివర్సిటీల బోర్డులే మిగులుతాయని రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం విద్యార్థుల ఆహ్వానం మేరకు ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు రెండేళ్లుగా పర్మినెంట్ వీసీలను నియమించనందున పాలనా వ్యవహారాలు పూర్తిగా స్తంభిం చాయన్నారు. ఓయూకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు రద్దు కావడంతో యూజీసీ నిధు లు రావడం లేదన్నారు. త్వరలో వం దేళ్లు జరుపుకోనున్న ఓయూకు రెండు సంవత్సరాలుగా పర్మినెంట్ వీసీ లేనందున ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పాలన కుంటుపడ్డాయన్నారు. ఇంచార్జి వీసీగా ఐఏఎస్ అధికారిని నియమించడంవల్ల ప్రతి సంతకానికీ సచివాలయం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విశ్వవిద్యాలయాల సమస్యలపై ఈ నెల 29న ఓయూలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులే పలికిస్తున్నాయి తప్ప ఎవరో చెబితే విని అం టున్న మాటలు కాదన్నారు. ప్రజా సంక్షే మం కోసం మాట్లాడితే తనను మం త్రులు విమర్శించడం దారుణమన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధికి నిరంతరం ఉద్యమాలు జరుగుతూనే ఉం టాయన్నారు. ఓయూలో గల విద్యార్థి జేఏసీలు ఏకమై సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన సమ యం ఆసన్నమైందని నిజాం కాలేజీ అధ్యాపకులు డాక్టర్ ఇటికాల పురుషోత్తం పిలుపునిచ్చారు.