హయత్‌నగర్ మండలం బలిజగూడ గ్రామం మీదుగా వెళ్తున్న టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
హయత్‌నగర్ మండలం బలిజగూడ గ్రామం మీదుగా వెళ్తున్న టిప్పర్ల అతివేగానికి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ గ్రామస్తులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేస్తూ టిప్పర్ల అడ్డుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న క్రషర్‌మిషన్లు, రెడీమిక్స్, బీటీమిక్స్ ప్లాంట్లకు సంబంధించిన వందలాది టిప్పర్లు తమ గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్నాయని, అయితే ఈ టిప్పర్లన్నీ అతివేగంతో నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ క్రమంలోనే గత మూడు రోజుల క్రితం టిప్పర్ వేగానికి గ్రామానికి చెందిన ఓ యువకులు బలి అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు, ఆర్టీఓ అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి టిప్పర్ల వేగానికి కళ్లెం వేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర జ్ఞానేశ్వర్‌గౌడ్, ఉప్పు వెంకటేష్, బల్లెపు సతీష్‌లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.