కేంద్ర మంత్రి సుజనా చౌదరిని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరిని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సుజనా.. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో మీడియాతో రఘువీరా మాట్లాడారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆర్థిక నేరస్థుడు' అంటూ ధ్వజమెత్తారు.
సుజనాను కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించకపోతే.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను కూడా అనుమానించాల్సి వస్తుందని రఘువీరా చెప్పారు.