రాజ సదారాం సేవలు చిరస్మరణీయం | Raja sadharam services are memorable says Madhusudanachari, Harish Rao | Sakshi
Sakshi News home page

రాజ సదారాం సేవలు చిరస్మరణీయం

Published Sat, Sep 9 2017 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

రాజ సదారాం సేవలు చిరస్మరణీయం - Sakshi

రాజ సదారాం సేవలు చిరస్మరణీయం

- పదవీ విరమణ వీడ్కోలు సభలో స్పీకర్‌ మధుసూదనాచారి
ఆయన సేవలను వినియోగించుకుంటాం: హరీశ్‌రావు
 
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభకు రాజ సదారాం చేసిన సుదీర్ఘ సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. శాసనసభ కార్యదర్శిగా సదారాం పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. శాసనసభ చక్కగా నడవడానికి సదారామే కారణమని కొనియాడారు. తామిద్దరం వరంగల్‌ వాళ్లమేనని, జయశంకర్‌ శిష్యులమని, ఇద్దరమూ కేసీఎం కళాశాల విద్యార్థులమని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ బిల్లు సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు.

సదారాం సేవలను భవిష్యత్తులో తమ ప్రభుత్వం వినియోగించుకుం టుందని పేర్కొన్నారు. మండలిని సజావుగా నడిపేందుకు సదారాం అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి విలువైన సూచనలు చేసేవారని మంత్రి ఈటల  పేర్కొన్నారు.    శాసనసభకు విలువైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తినే కొత్త కార్యదర్శి కొనసాగించాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవడంలో ఆయన పాత్ర మరువలేనిదని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

శాసనసభను బాగా నడపడంలో ఎంతో కృషి చేశారని హోంమంత్రి నాయిని కొనియాడారు.  పదవీ విరమణ చేస్తున్నం దుకు ఒకింత బాధ, సంతోషం కలుగుతోందని సదారాం పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, పీఏసీ చైర్మన్‌ గీతారెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement