ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు | Raja Singh comment on Ram Mandir | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sun, Apr 9 2017 4:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌: అయోధ్యలో రామమందిరం అంశంపై బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ’రామమందిరం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, ఇతరుల ప్రాణాలు తీయడానికైనా సిద్ధమే. వచ్చే శ్రీరామనవమిలోగా రామమందిరాన్ని కట్టితీరుతాం’ అని ఆయన అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించేవారి తల నరుకుతానని ఆయన గురువారం ఓ బహిరంగ సభలో హెచ్చరించారు. నగరంలోని గోషామహాల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. పలుసార్లు అరెస్టయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బంపర్‌ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో అయోధ్యలో రామమందిరం అంశం మరోసారి తెరపైకి వచ్చిన అంశం తెలిసిందే. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వివాదాస్పద రామమందిరం-బాబ్రీ మసీదు అంశాన్ని కోర్టు బయట సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు ఒకింత దుమారాన్ని రేపుతున్నాయి. కేంద్రమంత్రి, బీజేపీ నేత ఉమా భారతి ఇప్పటికే స్పందిస్తూ రామమందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధమని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement