చిరుజల్లులతో ఉపశమనం | relief With thundershowers | Sakshi
Sakshi News home page

చిరుజల్లులతో ఉపశమనం

Published Sun, May 3 2015 11:15 PM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

చిరుజల్లులతో ఉపశమనం - Sakshi

చిరుజల్లులతో ఉపశమనం

సిటీబ్యూరో: ఉదయం నుంచే మండుటెండతో విలవిల్లాడిన సిటీజనులు..ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై.. ఒక్కసారిగా కురిసిన జల్లులతో ఉపశమనం పొందారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్లు కురిశాయి.

సాయంత్రం 5.30 గంటల వరకు 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టంగా 39.6 డిగ్రీలు, కనిష్టంగా 27.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 47 శాతంగా నమోదైంది. రాగల 24 గంటల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement