రమ్మీ జూదం కాదు.. స్కిల్‌ గేమ్‌! | Rummy is not gambling it is a skill game | Sakshi
Sakshi News home page

రమ్మీ జూదం కాదు.. స్కిల్‌ గేమ్‌!

Published Wed, Jun 28 2017 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Rummy is not gambling it is a skill game

- తెలంగాణ సర్కార్‌పై ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం
బుధవారం కూడా  కొనసాగనున్న విచారణ
 
సాక్షి, హైదరాబాద్‌: పేక ముక్కలతో ఆడే రమ్మీ జూదం కాదు.. నైపుణ్యాన్ని వెలికితీసే క్రీడ.. అని ఉమ్మడి హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎ.కె.గంగూలీ వాదించారు. ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ తెలంగాణ సర్కార్‌ ఈనెల 17న ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీనిని ముంబైకి చెందిన పలు రమ్మీ క్రీడా నిర్వహణ సంస్థలు వ్యతిరేకిస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వాటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది.

ధర్మాసనం ఎదుట గంగూలీ వాదిస్తూ.. రమ్మీ ఆట జూదం కాదని, నైపుణ్యాన్ని వెలికి తీసే క్రీడ అని పేర్కొన్నారు. పైగా, సుప్రీంకోర్టు కూడా ఇతర కేసుల్లో రమ్మీ జూదం కాదని గతంలో తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుల్లో వాదనలు అసంపూర్తిగా జరగడంతో బుధవారం కూడా విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement