ట్యూషన్‌కు వెళ్లగా ఘటన
యాకుత్‌పురా: అభం..శుభం తెలియని చిన్నారిపై ఓ మానవ మృగం లైంగికదాడికి పాల్పడింది. రెయిన్‌బజార్ ఠాణా పరిధిలో ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... యాకుత్‌పురా బ్రాహ్మణ్‌వాడీ ప్రాంతానికి చెందిన బాలిక (6) స్థానిక పాఠశాలలో యూకేజీ చదువుతోంది. పాఠశాల నుంచి వచ్చాక ఇదే ప్రాంతంలోని ఓ ఇంటికి ట్యూషన్‌కు వెళ్తోంది. రోజు మాదిరిగానే గతనెల 29న ట్యూషన్‌కు వెళ్లగా.. ఆ సమయంలో ట్యూషన్ టీచర్ ఇంట్లో లేడు. అక్కడే ఉన్న అతని బంధువు నర్సింహ (25) బాలికను లోపలికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఎవరీకి చెప్పలేదు.
ఈనెల 2న చిన్నారికి తీవ్రజ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు బాలికను నిలదీయగా.. అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
బాలికపై లైంగిక దాడి
Published Wed, Nov 5 2014 3:21 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement
Advertisement