గవర్నర్ నరసింహన్ తన హోదాను మరచి సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారని శాసనమం డలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తన హోదాను మరచి సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారని శాసనమం డలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ, డైనమిక్ సీఎం కేసీఆర్.. అంటూ గవర్నర్ పొగిడారని, కేసీఆర్ ఎందులో డైనమిక్ అనేది ప్రజలకు చెప్పాలన్నారు.
రుణమాఫీ చేయకుండా రైతులను మోస గించినందుకా, దళితులకు 3ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వకుండా మాటతప్పి నందుకా, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వనందుకా? ఎందులో కేసీఆర్ డైనమిక్ అని ప్రశ్నించారు. గవర్నర్ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించడం లేదన్నారు. ఫిరా యింపులను కట్టడి చేయకుండా, వాటిని పోత్సహించడం దారుణమన్నారు. కేసీఆర్ భజన చేయడం మానుకుంటే మంచిదని సూచించారు. ఇలాంటి గవర్నర్‌కు వినతి పత్రాలు ఇవ్వడం కూడా అనవసరం అని, ఇకపై ఆయనకు వినతులు ఇవ్వమన్నారు.