
సీఎం అలా అనడమే పెద్ద అబద్ధం: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: ఇతర రాజకీయ నేతల్లా తాను అబద్ధాలు ఆడనని సీఎం కేసీఆర్ చెప్పడమే ఓ పెద్ద అబద్ధమని శాసనమండలిలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటయిందే అబద్ధాల పునాదులపైన అని ఆయన విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘మీ అబద్ధాల వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి..’ అని ఆయన ధ్వజమెత్తారు. మీ అబద్ధాల జాబితా చాలా పెద్దది, అవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, సీఎం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలనయినా వెంటనే నెరవేర్చాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు.