
చైనీస్ మాంజాపై త్వరలో నిషేధం
అటవీ శాఖ ప్రధాన ముఖ్యసంరక్షణాధికారి పీకే శర్మ
సాక్షి, హైదరాబాద్: గాలిపటాలను ఎగురవేయడంలో చైనీస్ మాంజా (నైలాన్ మాంజా)ను వాడటం వల్ల జీవ హానితోపాటు, పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోందని అటవీ శాఖ ప్రధాన ముఖ్యసంరక్షణాధికారి (పీసీసీఎఫ్) పీకే శర్మ అన్నారు. ఈ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నైలాన్ మాంజా వినియోగంపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి లేఖ రాశామని, త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. నైలాన్ మాంజాతో పక్షుల రెక్కలు తెగడం, తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందన్నారు. దారాల్లో చిక్కుకుని మోటారు సైక్లిస్టులు, చిన్నారులు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.
అందువల్ల దారంతో చేసిన మాంజాలను వినియోగించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ జీవ ైవె విధ్య మండలి సభ్య కార్యదర్శి సువర్ణ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏకే శ్రీవాస్తవ పాల్గొన్నారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో ఐదేళ్ల తర్వాత మూడు పులులు కనిపించాయని పీసీసీఎఫ్ పీకే శర్మ వెల్లడించారు.