
దాహేయ్ పర్వత ప్రాంతం(ఫైల్ ఫొటో)
బీజింగ్: ఈశాన్య చైనాలోని దాలియన్ నగరంలో మంటలలో చిక్కుకొని దాహేయ్ పర్వతారోహణ చేస్తున్న అయిదుగురు దుర్మరణం చెందారు. పర్వతారోహణ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఇప్పంటుంది. దాంతో ఆ ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటలలో చిక్కుకొని పర్వతారోహకులు అయిదుగురు దుర్మరణం చెందారు.
300 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చాయి. మరణించిన పర్వతారోహకులకు సంబంధించిన సమాచారం తెలియవలసి ఉంది.