
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగాన్ని ఆపండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారానికి, హోర్డింగులు పెట్టేందుకు ప్రభుత్వ భవనాలను టీఆర్‌ఎస్ వాడుకుంటోందని ఆయనకు చెప్పారు. అధికార పక్షానికి అధికారులు వంతపాడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన హోర్డింగులను, ప్రభుత్వ భవనాలకు కట్టిన ఫ్లెక్సీలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.