హుక్కా తాగించి.. క్లాస్‌మేట్‌పై గ్యాంగ్ రేప్ | student gangraped after consuming hukka by co students | Sakshi
Sakshi News home page

హుక్కా తాగించి.. క్లాస్‌మేట్‌పై గ్యాంగ్ రేప్

Published Wed, Nov 16 2016 5:44 PM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM

హుక్కా తాగించి.. క్లాస్‌మేట్‌పై గ్యాంగ్ రేప్ - Sakshi

హుక్కా తాగించి.. క్లాస్‌మేట్‌పై గ్యాంగ్ రేప్

తమ తోటి విద్యార్థినిని హుక్కా సెంటర్‌కు తీసుకెళ్లి, అక్కడ ఆమెతో బలవంతంగా హుక్కా తాగించిన విద్యార్థులు.. మత్తులో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రిస్టన్ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే ఓ విద్యార్థినిని ఆమె క్లాస్‌మేట్లు ఇద్దరితో పాటు మరి కొందరు విద్యార్థులు కలిసి మేడిపల్లిలోని హాట్ కప్ హుక్కా సెంటర్‌కు తీసుకెళ్లారు. 
 
ఆమెకు హుక్కా తాపించి తమతోపాటు గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. ఇద్దరు బీటెక్, ఇద్దరు డిప్లొమా విద్యార్థులతో పాటు హుక్కా సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement