తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటి సబ్ కాంట్రాక్టర్ల మొర
సాక్షి, హైదరాబాద్: బడా కాంట్రాక్టర్ల నుంచి సకాలంలో బిల్లులు అందక సబ్ కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు. ప్రధాన కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకున్నా, తమకు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమగోడు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ స్టేజ్- 2, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల కింద కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రధాన సంస్థలన్నీ 90 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్లకే అప్పగించాయి. ఇప్పటికే వేల కోట్లల్లో పనులను పూర్తి చేశారు. కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ.150కోట్ల నుంచి రూ.200ల కోట్ల వరకు ఉన్నాయని సబ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు.
పైసలిప్పించండి మహాప్రభో..!
Published Fri, Dec 5 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement
Advertisement