జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి నెల వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని స్పీకరు సిరికొండ మధుసూదనాచారి తెలిపారు.
చిట్యాల(వరంగల్ జిల్లా): జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి నెల వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని స్పీకరు సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో కరువు సమస్యపై చర్చించడం జరుగుతుందన్నారు.
పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అంశం తన పరిధిలో ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభాపతిగా నియమించబడి నేటికి 550 రోజులు అవుతున్నదని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం రోజుకు 15 గంటలు కష్టపడుతున్నట్లు ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో 18 గ్రామాల్లోని 1200 చెంచు కుటుంబాలను చేరదీసి వారిని కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నాని స్పీకరు పేర్కొన్నారు.