
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ‘సెట్’ నిబంధనలు సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంసెట్ ద్వారా భర్తీ అయ్యే ఇంజినీరింగ్, ఏజీ బీఎస్సీ, మెడికల్, వెటర్నరీ కోర్సులతో పాటుగా ఇక నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును కూడా పొందుపరిచారు. ఇక నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఎంసెట్ ద్వారనే అడ్మిషన్లు పొందాలి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు అభ్యసించే విద్యార్థుల కనిష్ట వయసు డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు, గరిష్ట వయసు జనరల్, బీసీ అభ్యర్థులకు 22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ కులాల వారికి 25 ఏళ్లు ఉండే విధంగా నిబంధనలలో మార్పులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment