హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్లేది లేదంటూ సచివాలయంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చారు. తెలంగాణకు చెందిన తమను ఆ ప్రభుత్వానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం సచివాయంలోని ఎల్ బ్లాక్ ముందు మూడు, నాలుగో తరగతి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. చాలీచాలని జీతాలతో తాత్కాలిక రాజధాని వెలగపూడికి వెళ్లి ఎలా బతకాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ’, న్యాయం చేయాలంటూ అంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం సచివాలయం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీర వెంకటేశ్వరరావు మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ... ఏపీ సచివాలయంలో తెలంగాణకు చెందిన క్లాస్‌ఫోర్ ఉద్యోగులు 255 మంది ఉన్నారని వారందరిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
‘అమరావతికి వెళ్లేది లేదు’
Published Thu, Jun 9 2016 3:02 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement