నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, వరంగల్ ప్రాంగణాల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 7వ తేదీ నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రెగ్యులర్, సాయంకాలం నిర్వహించే ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులకు ప్రవేశ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని, తేదీలు తరువాత ప్రకటిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.