అక్బరుద్దీన్ థానే రావద్దని నోటీసులు
హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని మహారాష్ట్ర పర్యటనకు రావద్దని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు. ఈనెల 23న మహారాష్ట్ర థానేలో జరగనున్న ఓ బహిరంగసభకు అక్బరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఆ బహిరంగ సభకు హాజరు కాకూడదంటూ థానే కమిషనర్ సోమవారం నోటీసులు పంపారు. థానేలో ప్రస్తుతం పరిస్థితులు బాగోలేదని, అందువల్ల సభకు రావద్దంటూ మహారాష్ట్ర పోలీసులు అక్బరుద్దీన్ కు ఆ నోటీసులో వెల్లడించారు.