యువత చైతన్యంపైనే దేశ భవిషత్ ఆధారపడి ఉంటుందని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. ఆదివారం సుందరయ్య పార్కులో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్, యువ సేవ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితంలో అనేక మార్పులున్నాయని, వాటిని ఆయన ఇతరులకు కూడ పంచారని అన్నారు.
దేశం సంవద్దిగా అభివద్ది చెందాలంటే వ్యవసాయం, విద్య, ఆరోగ్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివద్దిని సాధించాలని అన్నారు. అన్నికంటే ముఖ్యమైనవి, అన్నదానం, విద్యాదానం, రక్తదానమని వీటన్నింటిని కలిపితేనే జీవనాధారం అవుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్.సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాండయ్య, కోశాధికారి విజయభాస్కర్, గోవింద్, క్లబ్ మాజీ అధ్యక్షులు కందూరి కృష్ణ, సంపత్ రెడ్డి, యువ సేవ ప్రతినిధులు పాల్గొన్నారు.