హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలి | the helmet provision should lift | Sakshi
Sakshi News home page

హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలి

Published Sun, Mar 20 2016 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

the helmet provision should lift

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మోటారు హెహికల్ చట్టం 1988 చట్టంలోని సెక్షన్ 129ను సవరించి, హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర టూ వీలర్స్ రైడర్స్ అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ కల్లా ప్రభుత్వం హెల్మెట్ నిబంధనను ఎత్తివేయకపోతే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ టూ వీలర్స్ రైడర్స్ అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలని, మద్య నిషేదం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం తెలంగాణ టూ వీలర్స్ రైడర్స్ అసోసియేషన్ ఆధర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మోటారు హెహికల్ 1988 చట్టంలోని సెక్షన్ 129 ప్రతులను బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఎదురుగా దగ్దం చేశారు.

 అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యను, కాలుష్యాన్ని నివారించడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. హెల్మెట్ స్థానంలో తలపాగాను అనుమతించాలని కోరారు. దొంగతనాలు, స్నాచింగ్ లాంటి అసాంఘీక కార్యకలపాలు చేసేవారికి హెల్మెట్ నిబంధన ఒక వరంలా మారుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే హెల్మెట్ నిబంధనపై పునరాలోచన చేయాలని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జె. రవీందర్, సత్తిరెడ్డి, ఎంఏ సలీమ్, షేక్ రహీం, చాంద్ పాషా, కె. లక్ష్మీనర్సయ్య, మహ్మద్ అజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement