ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్‌ | High Court Serious On Ap Police For Not Enforcing Helmet Rule | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్‌

Published Wed, Dec 11 2024 5:36 PM | Last Updated on Wed, Dec 11 2024 6:48 PM

High Court Serious On Ap Police For Not Enforcing Helmet Rule

సాక్షి, విజయవాడ: హెల్మెట్‌ నిబంధన అమలు చేయకపోవడంపై ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు హెల్మెట్‌ ధరించక 667 మంది చనిపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హెల్మెట్‌ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదంటూ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.

ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసిన హైకోర్టు.. వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను వ‌చ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.

AP: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఆగ్రహం

ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement