Helmet Rule
-
పెట్రోల్ పోయవా? అయితే కరెంట్ కట్
లక్నో: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల మరణాలను నివారించే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఒక నిబంధన రాష్ట్రంలోని విద్యుత్ శాఖ లైన్మెన్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతను పెట్రోల్‌బంక్‌కు విద్యుత్ సరఫరాను నిలిపేసిన ఘటన హాపూర్ జిల్లా లోని పార్థాపూర్ రోడ్డులో జరిగింది. హెల్మెట్ ధరి స్తేనే ద్విచక్రవాహనదారులకు పె ట్రోల్‌ను విక్రయించాలనే నిబంధనను అమలుచేయాలని యూపీ సర్కార్ ఆదేశించింది. దీంతో పార్థాపూర్ రోడ్డులోని ఒక పెట్రోల్‌బంక్ సైతం ఇదే నియమాన్ని పాటిస్తోంది. మంగళవారం ఈ పెట్రోల్‌బంక్‌కు వచ్చిన కరెంట్ డిపార్ట్మెంట్ లైన్మెన్ పెట్రోల్ అడగ్గా బంక్ సిబ్బంది నిరాకరించారు. హెల్మెట్ ధరించి వస్తేనే బైక్‌కు పెట్రోల్ కొడతామని కరాఖండీగా చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లైన్మెన్ అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి బంక్‌కు విద్యుత్‌సరఫరా అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఉన్న కరెంట్‌స్తంభం ఎక్కి వైర్‌ను కత్తిరించాడు. దీంతో బంక్‌లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంధన వినియోగదారుల చాంతడంత క్యూలైన్ ఏర్పడింది. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే లైన్మెన్ కరెంట్ లైన్‌ను కత్తిరించిన విషయం అక్కడి సీసీటీవీలో రికార్డ్‌కావడంతో అది లైన్మెన్ పని అని తర్వాత తెలిసింది. వెంటనే స్థానికులు ఫిర్యాదుచేయడంతో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
రూల్స్ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే!
మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడం చూస్తుంటాం. మనం రూల్స్ పెట్టుకుంటాం. కానీ, వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటాం అని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్తేం కాదు కదా అనుకుంటున్నారా?. అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీకు చదివి తెలుసుకోవాల్సిందే.India Not For Beginers అంటూ సోషల్ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్‌ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్నే కలగజేయకమానదు. రూల్స్ ఫాలో కావాలా? అయితే జరిగేది ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్(Hapur) జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే..మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్‌తో ఓ బంక్‌లోకి వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. ‘‘రూల్స్ది ఏముంది లే.. పోయండబ్బా’’ అని సిబ్బందికి రిక్వెస్ట్ చేశాడా వ్యక్తి. అయితే.. తమ ఓనర్‌కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్లు కరాకండిగా చెప్పేశారు వాళ్లు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు..అతను అలా వెళ్లాడో లేదో.. ఓ ఐదు పది నిమిషాలకు బంక్‌లో కరెంట్ పోయింది. చుట్టుపక్కల అంతా కరెంట్ ఉండగా.. తమకు మాత్రమే కరెంట్ పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్‌కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయించి రప్పించాడు. వాళ్లు వచ్చి చూసేసరికి బంక్‌కు పవర్ సప్లై అయ్యే ఫ్యూజు పీకేసి ఉంది. అయితే..ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని చెప్పడంతో.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీలో పోల్ మీద కనిపించిన వ్యక్తి ఇందాక బంక్‌కు వచ్చాడని సిబ్బంది చెప్పగా.. విద్యుత్ సిబ్బంది సైతం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తమ తోటి సిబ్బంది అని చెప్పడంతో ఈసారి బంక్ ఓనర్ కంగుతిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు పెట్రోల్ పోయకుండా రూల్స్ పాటించమన్నందుకే ఆ పని చేశానంటూ కోపంగా చెబుతున్నాడా లైన్మెన్.యూపీలో ఇప్పుడు ప్రతీ బంక్ వద్ద నో హెల్మెట్.. నో పెట్రోల్(No Helmet No Petrol) పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. బంక్‌లోకి వచ్చే టైంలో పైలాన్ రైడర్లూ ఉన్నా హెల్మెట్ తప్పనిసరి చేశారు. అంతేకాదు.. బంకుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండడంతో సీసీఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్ యాజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయంటూ బంకు ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు.#Hapurपिलखुवा क्षेत्र के परतापुर रोड स्थित श्री जी फ्यूल पर एक अजीबो गरीब मामला सामने आया हैबिना हेलमेट बिजली विभाग के कर्मचारियों को पेट्रोल ना देना पेट्रोल पंप संचालक को पड़ा भारी लाइनमैन ने काट दी पेट्रोल पंप की बिजलीघटना सीसीटीवी में हुई कैद @DmHapur pic.twitter.com/My77ptruK3— Asian News UP (@AsianNewsUP) January 15, 2025 -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
సాక్షి, విజయవాడ: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించక 667 మంది చనిపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదంటూ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసిన హైకోర్టు.. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం -
హెల్మెట్ రూల్స్ కఠినతరం: ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు..
న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్ విషయంలో మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది. నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా ఫైన్ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పక ఉండాల్సిందే. పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌పై వేటు వేస్తారు. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే టూవీలర్స్‌పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం. బైక్ రైడింగ్‌లో ఉన్నప్పుడు హెల్మెట్ బకెల్, బ్యాండ్ గనుక పెట్టుకోకున్నా.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఐఎస్ఐ మార్క్, బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. హెల్మెట్ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రెడ్ లైట్ జంపింగ్ చేయడం లాంటివాటికి కూడా 2 వేల రూపాయల జరిమానా తప్పదు. చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
హెల్మెట్ మస్ట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా బైకులు నడుపుతున్న వారిపై సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60శాతం మంది హెల్మెట్ లేకపోవడంతోనే గాయపడుతున్నారని గణాంకాలు చెబుతుండడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఏడాదిలో జూలై వరకు 12,96,580 మంది వాహనదారులకు చలాన్లు వేశారు. మొత్తం రూ.12,92,09,600 జరిమానా విధించారు. తనిఖీలు చేస్తున్నా, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా హెల్మెట్ ధరించకుండా వెళ్లేవారు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తుండడంతో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాల్లోని పోలీసులు విద్యాసంస్థలు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రధాన మార్గాల్లో ఉండి హెల్మెట్ ధరించని ఫొటోలు కెమెరాల్లో బంధించి ఈ–చలాన్లు ఇంటికి పంపుతున్నారు. కొన్నిసార్లు స్పాట్లోనే పట్టుకొని జరిమానాలు విధించడంతో పాటు రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో ఉల్లంఘన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాలను వీడియో ప్రజంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వారి వాహనాలను తిరిగి ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ మైనర్లు చిక్కితే వాహనాలను స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మరోసారి ద్విచక్ర వాహనాన్ని నడపనివ్వమంటూ లిఖిత పూర్వకంగా రాయించుకుంటున్నారు. నేరమని తెలిసీ... ద్విచక్ర వాహనదారుల్లో కొందరు హెల్మెట్లు ధరించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్ నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మోటార్ వాహన చట్టం ప్రకారం నేరం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్లు ఖాతాలోకి వెళ్తాయని, వీటి ద్వారా జైలు శిక్షలు పడతాయంటూ హెచ్చరిస్తున్నారు. ఉల్లంఘనులకు సంబంధించి తాము పట్టుకున్న ప్రతి వాహనం వివరాలను రవాణా శాఖ సర్వర్‌లోని రికార్డులకు అనుసంధానిస్తున్నామని వివరిస్తున్నారు. ఇప్పటికే 10 పాయింట్లు దాటేసిన వారి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. 12 పాయింట్లు చేరుకున్నాక వారి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దవుతుందని, అలాగే జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసుల దగ్గరున్న ట్యాబ్ ద్వారా గుర్తిస్తున్నారు. లైసెన్స్ నంబర్ నమోదు చేస్తే వాహన చోదకుల చరిత్ర తెరపై కనిపిస్తుందని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. తద్వారా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఇరు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు విజయ్‌కుమార్, దివ్యచరణ్ తెలిపారు. చలాన్లు ఇలా... (జనవరి–జూలై) కమిషనరేట్ చలాన్లు జరిమానా(రూ.ల్లో) సైబరాబాద్ 8,42,653 8,38,35,600 రాచకొండ 4,53,927 4,53,74,000 -
హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మోటారు హెహికల్ చట్టం 1988 చట్టంలోని సెక్షన్ 129ను సవరించి, హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర టూ వీలర్స్ రైడర్స్ అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ కల్లా ప్రభుత్వం హెల్మెట్ నిబంధనను ఎత్తివేయకపోతే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు. తెలంగాణ టూ వీలర్స్ రైడర్స్ అసోసియేషన్ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధనను ఎత్తివేయాలని, మద్య నిషేదం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం తెలంగాణ టూ వీలర్స్ రైడర్స్ అసోసియేషన్ ఆధర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మోటారు హెహికల్ 1988 చట్టంలోని సెక్షన్ 129 ప్రతులను బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఎదురుగా దగ్దం చేశారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యను, కాలుష్యాన్ని నివారించడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. హెల్మెట్ స్థానంలో తలపాగాను అనుమతించాలని కోరారు. దొంగతనాలు, స్నాచింగ్ లాంటి అసాంఘీక కార్యకలపాలు చేసేవారికి హెల్మెట్ నిబంధన ఒక వరంలా మారుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే హెల్మెట్ నిబంధనపై పునరాలోచన చేయాలని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జె. రవీందర్, సత్తిరెడ్డి, ఎంఏ సలీమ్, షేక్ రహీం, చాంద్ పాషా, కె. లక్ష్మీనర్సయ్య, మహ్మద్ అజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కఠినంగా వ్యవహరించాలి
హెల్మెట్ నిబంధనపై హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించని వాహనదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే పురోగతి కన్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్ వాడని వాహనదారులను ఆపి, జరిమానాలు విధిస్తున్నట్లు తమకు ఎక్కడా కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెల్మెట్ ధరించే విషయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని, కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు 2009లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం ఇప్పటికే పలుమార్లు విచారించింది. సోమవారం మరోసారి విచారించింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారు రోజూ తమకు అత్యధికంగా కనిపిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే 49 వేల కేసులు నమోదు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందేపల్లి సంజీవ్ కుమార్ చెప్పారు. ఎన్ని ద్విచక్ర వాహనాలున్నాయని ధర్మాసనం ప్రశ్నించగా, 40 లక్షలున్నాయని సంజీవ్ చెప్పారు. దీని ప్రకారం ఒక్క శాతం మేర కేసులను మాత్రమే నమోదు చేశారంటూ హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. -
హెల్మెట్‌ను నిషేధించ కపోతే ఆమరణ దీక్ష
టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ సుల్తాన్‌బజార్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను ప్రభుత్వం వెంటనే తొలగించాలని, లేకపోతే అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అమానుల్లాఖాన్ అన్నారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...హెల్మెట్విషయంలో సిక్కులకు మినహాయింపు ఇచ్చినట్లుగా తెలంగాణలో ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హెల్మెట్నిబంధనను తీసి వేస్తే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే ద్విచక్రవాహనదారులు గెలిపిస్తారన్నారు. హెల్మెట్ నిబంధన ఎత్తివేయకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ెహచ్చరించారు. సమావేశంలో నాయకులు రవీం దర్, లక్షీ్ష్మనారాయణ, లక్కీ, సయ్యద్ పాల్గొన్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
నెల్లూరు (టౌన్) : నవంబరు 1వ తేదీ వరకు వాహనదారులపై ఎలాంటి ఫైన్లు విధంచరాదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్. కృష్ణారావు వివిధ శాఖాధికారులను ఆదేశించారు. ఈలోపు వాహనం నంబరు, పేరు నమోదు చేసుకుని వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అయితే జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయా శాఖాధికారులు పట్టించుకోకుండా వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. హెల్మెట్ లేదంటూ పోలీసులు రూ.100 నుంచి రూ.1000 వరకు ఫైన్ విధిస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రధాన రహదారుల గుండా వెళ్లాలంటే భయపడుతున్నారు. ద్విచక్ర వాహనం వెనుకవైపు కూర్చున వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్‌ను వినియోగించాలన్న నిబంధనపై వాహనాదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెరిగిన హెల్మెట్ ధరలు వాహనదారులు హెల్మెట్‌ను వినియోగించాలన్న నిబంధనను తప్పనిసరి చేయడంతో దుకాణదారులుకు కాసుల వర్షం కురిపిస్తుంది. హెల్మెట్లు ధరలను అమాంతంగా పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. దుకాణాదారులు ఐఎస్ఐ పేరుతో నకిలీలను వాహనదారులకు అంటగడుతున్నారు. ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడాల్సిన హెల్మెట్లు కొనుగోలు సమయంలోనే తలకు మించిన భారంగా పరిణమించింది. రహదారుల వెంబడి విక్రయిస్తున్న హెల్మెట్లు నాలుగురోజుల క్రితం వరకు ఒక్కోటి రూ.300 అమ్మితే ప్రస్తుతం రూ.600కు అమ్ముతున్నారు. ఓవైపు ఐఎస్ఐ, అధునాతనమైనవని చెబుతూ రూ. 1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్నే వాడాలన్న అధికారుల సూచనలను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం చెల్లించి ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ను కొనుగోలు చేసినా ఉన్న లోగోలు నకిలీవని తెలిసి వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. గడ్డం దగ్గర వచ్చే ఐఎస్ఐ మార్కు చూసి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలో డిమాండ్‌కు తగ్గ హెల్మెట్లను సరఫరా చేయడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఫైన్ విధింపునకు అత్యుత్సాహం హెల్మెట్ వినియోగం పోలీసులకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. జూలై 1నుంచి హెల్మెట్ వినియోగం తప్పనిసరని నిబంధనతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ వినియోగించని వాహనదారులపై రూ.100 నుంచి రూ.1000 చలానా రూపంలో జరిమానా విధించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిబంధనల పేరుతో రూ. 100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాహనదారుడు చలానా అడిగితే రూ.1000 జరిమానా చెల్లించాలని చెబుతుండటంతో చేసేదిలేక అక్కడ నుంచి చల్లగా జారుకుంటున్నారు. హెల్మెట్‌తో పాటు వాహనానికి సంబంధించిన సీబుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లెసైన్స్‌లను కూడా తనిఖీ చేస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వీటి పేరుతో భారీగా డబ్బులు వ సూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కౌన్సెలింగ్ నిల్.. హెల్మెట్ వినియోగంపై పోలీసు, రవాణా అధికారులు వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. కాని జిల్లాలో ఎక్కడా ఈకార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. హెల్మెట్ వినియోగంపై తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హెల్మెట్ వినియోగించడం వల్ల ప్రయోజనాలతో పాటు సరపడా హెల్మెట్లును తెప్పించడంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహిస్తాం ఎన్.శివరాంప్రసాద్, ఉపరవాణా కమిషనర్ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. ప్రధానంగా కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. నవంబర్ 1నుంచి హెల్మెట్ వినియోగించకపోతే కేసులు నమోదు చేస్తాం. అప్పటి వరకు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తాం.