ఏఎస్‌రావునగర్‌లో శ్రీలక్ష్మీవిలాస్ బ్యాంకు ప్రారంభం | The inauguration of the srilaksmivilas bank in AS Rao nagar | Sakshi
Sakshi News home page

ఏఎస్‌రావునగర్‌లో శ్రీలక్ష్మీవిలాస్ బ్యాంకు ప్రారంభం

Published Fri, Jan 29 2016 5:49 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

The inauguration of the srilaksmivilas bank in AS Rao nagar

ఏఎస్‌రావునగర్‌లో శ్రీలక్ష్మీ విలాస్ బ్యాంకు బ్రాంచిని వైటల్ తెరాపిటీక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.వేణుగోపాల్‌శెట్టి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు రీజనల్ డీజీఎం వి.చంతిర శేఖర్ మాట్లాడుతూ.. దేశంలో 456 లక్ష్మీవిలాస్ బ్రాంచిలతో రూ.40 వేల కోట్ల టర్నోవర్ నడుస్తుందని తెలిపారు. రీజియన్‌లో 29 బ్రాంచీలు, నగరంలో 17 బ్రాంచీలలో రూ.2392 కోట్ల వ్యాపారం జరుతుందన్నారు.

బ్రాంచీ మేనేజర్ కేవీఎస్‌ఆర్‌కే.ప్రసాద్ మాట్లాడుతూ.. గృహ రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ పీజు లేదని, ఏటీయం, లాకర్‌తో పాటు అన్ని రకాల బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కాప్రా సర్కిల్ మాజీ అధ్యక్షులు పెద్ధి నర్సింహగుప్తా, మల్కాజిగిరి బ్రాంచి మేనేజర్ మధుసూదన్, పెద్ది నాగరాజు గుప్తా, కాసం వెంకటహరి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement