రేపు ‘వ్యవసాయ’ పోస్టులకు పరీక్ష | tomorrow Online exam for Farm Post | Sakshi
Sakshi News home page

రేపు ‘వ్యవసాయ’ పోస్టులకు పరీక్ష

Published Fri, Jun 3 2016 12:43 AM | Last Updated on Mon, Oct 1 2018 5:09 PM

tomorrow Online exam for Farm Post

26 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష  హాజరుకానున్న 7,645 మంది అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణ అధికారి (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శనివారం పరీక్ష నిర్వహించనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసిన 26 కేంద్రాల్లో 7,645 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్షకు ఏర్పాట్లు చేశామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష (జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 (అగ్రికల్చర్) పరీక్ష జరగనుంది.

అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని పార్వతి సుబ్రమణియన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement