సెక్రటేరియట్‌ను కూల్చవద్దు: ఉత్తమ్
హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్లాది రూపాయలను వృథా చేయకుండా తగిన చర్యలను తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్షనాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం కలిసి వినతిపత్రాన్ని అందించారు.
గవర్నర్ను కలిసిన అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వాస్తు బాగాలేదనే సాకుతో సచివాలయాన్ని కూల్చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం దుర్మార్గమన్నారు. రెండు రాష్ట్రాలకు సరిపోయే విధంగా ఉన్న సచివాలయ భవనాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. వాస్తుపేరుతో కూల్చడానికి, కొత్తగా నిర్మించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.