* గుర్తింపు రాని ఇంజనీరింగ్ కాలేజీల్లో టీఆర్‌ఎస్ నేతలవే అధికం
* టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కాలేజీలన్నింటికీ అఫిలియేషన్లు
* కాంగ్రెస్, బీజేపీ నేతల కళాశాలలకూ గుర్తింపు
* ఎక్కువ లోపాలతోపాటు చిన్న లోపాలున్న వాటికీ నిరాకరణ
* లోపాలు సరిదిద్దుకుంటామన్న 34 కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారంలో ఈసారి రాజకీయ పార్టీల నేతలకు పెద్దగానే షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కాలేజీలకే అఫిలియేషన్లు లభించకపోగా, ఇతర పార్టీలకు చెందిన నేతల కాలేజీలు దాదాపు అన్నింటికీ అఫిలియేషన్లు రావడంపై అధికార, విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు అన్ని కాలేజీలతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకుల కళాశాలలకు అఫిలియేషన్లు లభించాయి. అయితే, టీఆర్‌ఎస్‌కి చెందిన నేతల కాలేజీలకు మాత్రం కత్తెర పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయా కళాశాలల యాజమాన్యాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కౌన్సెలింగ్ ముగిసేలోపే ఇవ్వండి...
లోపాలను తెలియజేయకుండా, సరిదిద్దుకునే అవకా శం ఇవ్వకుండా, నోటీసులైనా జారీచేయకుండా అఫిలి యేషన్లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పరిస్థితుల్లో జేఎన్‌టీయూహెచ్ సదరు కాలేజీలకు లోపాలపై తాజాగా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఆ లోపాలను సరిదిద్దుకుంటామన్న మరో 34 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెల 25న మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తికానుందని,దానికి ముందే అఫిలియేషన్లు ఇవ్వాలని చిన్నచిన్న లోపాలున్న యాజమాన్యాలు కోరుతున్నాయి.
అఫిలియేషన్ల వ్యవహారంలో ప్రధాన అంశాలు..
రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డికి చెందిన మూడు కాలేజీలకు అఫిలియేషన్లు రాలేదు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి చెందిన రెండు కళాశాలలకు గుర్తింపు నిరాకరించారు.
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు చె ందిన రెండు కాలే జీలకు అఫిలియేషన్లు ఇవ్వలేదు.
టీఆర్‌ఎస్ నేత మహబూబ్ అలీఖాన్‌కు చెందిన మూడు కాలేజీలకు కూడా గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.
టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఆయన బంధువులకు సంబంధించిన దాదాపు 15 కాలేజీలకు అఫిలియేషన్లు లభించగా.. తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన కళాశాలలకు గుర్తింపు వచ్చింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల కాలేజీలకూ అఫిలియేషన్లు లభించాయి.
అధికార పార్టీకి ‘అఫిలియేషన్’ షాక్!
Published Fri, Aug 22 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement