కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఈ విషయం తనకు ఎంఐఎం నేత అసదుద్దీన్ చెప్పారని పేర్కొన్న సీఎం కేసీఆర్ మాటలపై అసదుద్దీన్ స్పష్టతనివ్వాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు కుట్ర చేసి ఉంటే కేసీఆర్ అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన అంశాలపై గవర్నర్ వద్ద చర్చించడానికి తమ నేత చంద్రబాబు వస్తారని, కేసీఆర్ తేదీని నిర్ణయించాలని అన్నారు.