ఒంగోలు సబర్బన్: అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం(ఎన్‌ఎఫ్‌పీఈ) గ్రూప్-సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కమిటీలను ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోస్టల్ సర్కిళ్లను కూడా కేంద్ర ప్రభుత్వం విడగొట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ కేంద్రంగా సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రాల చివరి సమావేశం శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షుడు కె.నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్‌ఎఫ్‌పీఈ గ్రూప్-సి ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ జనార్ధన్ మజుందార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఎం.నాగేశ్వరరావు(అనకాపల్లి), ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్లు(ఒంగోలు), కోశాధికారిగా బి.మోహనరావు(ఒంగోలు)ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా వరంగల్‌కు చెందిన ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందిన శ్రీధరస్వామి ఎన్నికయ్యారు. వీటితోపాటు జిల్లాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
తపాలా ఉద్యోగుల 2 రాష్ట్రాల కమిటీల ఎన్నిక
Published Sat, Oct 1 2016 1:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement