హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్టు బోగస్ సర్వేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే సి.వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, రైతు సమస్యలను పరిష్కరించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బూటకపు సర్వేలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని వస్తున్న సర్వేలన్నీ నిజమని నమ్మితే, టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతరపార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దంకావాలని వంశీచంద్ సవాల్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన సవాలును టీఆర్‌ఎస్ స్వీకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని వంశీచంద్ ప్రశ్నించారు.
'బోగస్ సర్వేలతో మైండ్ గేమ్'
Published Sun, Oct 23 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement
Advertisement