
జగన్‌ను కలసిన వంశధార నిర్వాసితులు
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో కలిశారు.
సాక్షి, హైదరాబాద్: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో కలిశారు. వచ్చే జనవరి 5 నాటి కల్లా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఇంతవరకూ పునరావాసం, పరిహారం చెల్లించలేదని ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారు. నిర్వాసిత రైతుల నేత తిరుమారెడ్డి ప్రసాదరావు, బర్రె రవి, జగ్గునాయుడు, జగదీష్‌ల నేతృత్వంలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిశారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన జగన్ న్యాయం జరిగేలా పోరాడతానని హామీ ఇచ్చారు.