కూరగాయల మార్కెట్‌ను పెద్దనోటు ‘పడేసింది’ | Vegetable market down fall | Sakshi
Sakshi News home page

కూరగాయల మార్కెట్‌ను పెద్దనోటు ‘పడేసింది’

Published Fri, Nov 18 2016 3:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

కూరగాయల మార్కెట్‌ను పెద్దనోటు ‘పడేసింది’

కూరగాయల మార్కెట్‌ను పెద్దనోటు ‘పడేసింది’

- చిల్లర ఇబ్బందులతో కూరగాయల మార్కెట్లకు తగ్గిన రద్దీ
దిగివచ్చిన ధరలు...రైతన్న కుదేలు
 
 సాక్షి, హైదరాబాద్: సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పెద్దనోట్ల రద్దు... నగరం లోని అన్ని మార్కెట్ల వ్యాపారాలనూ కుదేలు చేసింది. ఎవరు చూసినా బడా నోట్లు బయటకు తీయడం... చేతి నిండా చిల్లరలేక పోవ డంతో దెబ్బకు కొనుగోళ్లన్నీ బందయ్యాయి. ఈ ప్రభావం కూరగాయల మార్కె ట్లపై అధికంగా కనిపిస్తోంది.

 రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర రగడతో కూరగాయల మార్కెట్లకు కొనుగోలుదారుల రద్దీ అనూహ్యంగా తగ్గింది.మిగిలిన సరుకును నిల్వ చేసుకు నేందుకు కూడా కోల్డ్ స్టోరేజీలు అందుబాటు లో లేక కూరగాయలు కుళ్లిపోతున్నారుు. దీని వల్ల తాత్కాలికంగా డిమాండ్ తగ్గి... ధరలు దిగివచ్చాయి. పాత కరెన్సీ రద్దయిన తొలిరెండు రోజుల్లో ఇబ్బందులు పడ్డ వ్యాపారులు... ఆ తర్వాత అవసరానికి సరిపడా కూర గాయలను తీసుకుని, గల్లీ కిరాణా వ్యాపారులకు ఇవ్వడం మొదలెట్టారు. అయినా వ్యాపారం అనుకున్నంత స్థారుులో జరగకపోవ డంతో తాము తీసుకున్న రేటుకు కొంతమేర కలుపుకొని తక్కువకే విక్రరుుస్తున్నారు.

 ‘చిల్లర’దెబ్బ...
 నగర శివారుతో పాటు వివిధ జిల్లాల నుంచి టమాటా, వంకాయ, బెండ కాయ, సొర కాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ ఉత్పత్తి అవుతున్నారుు. కోటి జనాభా ఉన్న నగరానికి రోజూ ఒక్కొక్కరికి 350 గ్రాముల చొప్పున 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. హోల్‌సేల్ మార్కె ట్లకు 25 లక్షల కూరగాయలు వస్తున్నారుు. వేసవిలో పది లక్షల కిలోల వరకు నగరంలో కొరత ఉంటుందని, ఇప్పుడు ఆ స్థారుు ఇబ్బం ది లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతు న్నారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం వారం రోజులుగా మార్కెట్‌కు వచ్చే లోడ్‌లపై పడిందని, కొనుగోలుదారులు ఆశించిన స్థారుు లో రాకపోవడంతో తీసుకున్న సరుకు కుళ్లిపో తోంది.  రైతుబజార్లలోనూ ఇదే పరిస్థితి.

 రూ.కోటి తగ్గిన అమ్మకాలు...
 నోటురద్దు దెబ్బకు బోయిన్‌పల్లి మార్కెట్ కుదేలరుుంది. రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగే ఈ మార్కెట్‌లో రాబడి ఒక్కసారిగి పడిపో రుుంది. దాదాపు కోటి మేరకు అమ్మకాలు పడి పోయాయి. గురువారం సాయంత్రం ఆరు గంటలకు క్యారెట్(గ్రేడ్ 1) పది కిలోలు రూ.70కి పడిపోరుుంది. వారం కిందట పది కిలోలు రూ.1,500కు విక్రరుుంచారు.

 కొనేవాళ్లు లేరు...
 బోయిన్‌పల్లి మార్కెట్ యార్డులో జరిగే కూరగాయల క్రయ, విక్రయాలతో నేరుగా సుమారు 2 వేల మందికి, పరోక్షంగా వేలాది మంది రైతులు, రైతు కూలీలకు ఉపాధి సమ కూరుతుంది. రాజధాని చుట్టూ ఉండే వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచీ నిత్యం వెరుు్యకి పైగా వాహనాల ద్వారా పెద్దఎత్తున కూరగాయలు మార్కెట్‌కు వస్తాయి. ఇక్కడి కమిషన్‌న్ ఏజెంట్ల మధ్య వర్తిత్వంతో వాటిని విక్రరుుస్తారు. రైతులకు నేరుగా నగదు అందజేస్తారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో హోల్‌సేల్ కూరగాయ విక్రేతలు కొనుగోళ్లను భారీగా తగ్గించేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ నగదు సమస్య కారణంగానే తాము క్రయ, విక్రయాలు చేయలేకపోతున్నా మంటున్నారు.
 
 దిగుబడి పెరిగినా తిప్పలే
 ఈసారి క్యారెట్ పంట దిగుబడి బాగా పెరిగింది. పదిరోజుల క్రితం వరకు రోజుకు 500 కిలోల వరకు మార్కెట్‌కు తరలిస్తే రూ.7వేల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కేవలం రూ.3వేలే అందుతుంది.     
     - పాండురంగారెడ్డి, షాబాద్
 
     రోజురోజుకూ తగ్గుతోంది
 మార్కెట్‌లో నగదు కొరత తీవ్రంగా ఉం డటంతో రోజు రోజుకీ తక్కువ ధరకే అమ్ము కోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా చిల్లర సమస్యతో పదిరోజులుగా కిలోకు రోజుకు రూ.1 చొప్పున తక్కువ ధరకు అమ్ముకుం టూ ఉన్నాం.     
- శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల
 
 సగం కూలీనే దక్కుతోంది
 మార్కెట్‌లో సుమారు 800మంది హమాలీలు ఉన్నాం. చిల్లర లేని కారణంగా సేఠ్‌లు, రైతుల సమస్యను చూసి కొన్ని సందర్భాల్లో సగం కూలి రేట్లే ఇస్తున్నా సర్దుకోవాల్సి వస్తోంది.     
     - సంపత్, మల్లేశ్(హమాలీలు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement