Marketing executives
-
కూరగాయల మార్కెట్‌ను పెద్దనోటు ‘పడేసింది’
- చిల్లర ఇబ్బందులతో కూరగాయల మార్కెట్లకు తగ్గిన రద్దీ - దిగివచ్చిన ధరలు...రైతన్న కుదేలు సాక్షి, హైదరాబాద్: సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పెద్దనోట్ల రద్దు... నగరం లోని అన్ని మార్కెట్ల వ్యాపారాలనూ కుదేలు చేసింది. ఎవరు చూసినా బడా నోట్లు బయటకు తీయడం... చేతి నిండా చిల్లరలేక పోవ డంతో దెబ్బకు కొనుగోళ్లన్నీ బందయ్యాయి. ఈ ప్రభావం కూరగాయల మార్కె ట్లపై అధికంగా కనిపిస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర రగడతో కూరగాయల మార్కెట్లకు కొనుగోలుదారుల రద్దీ అనూహ్యంగా తగ్గింది.మిగిలిన సరుకును నిల్వ చేసుకు నేందుకు కూడా కోల్డ్ స్టోరేజీలు అందుబాటు లో లేక కూరగాయలు కుళ్లిపోతున్నారుు. దీని వల్ల తాత్కాలికంగా డిమాండ్ తగ్గి... ధరలు దిగివచ్చాయి. పాత కరెన్సీ రద్దయిన తొలిరెండు రోజుల్లో ఇబ్బందులు పడ్డ వ్యాపారులు... ఆ తర్వాత అవసరానికి సరిపడా కూర గాయలను తీసుకుని, గల్లీ కిరాణా వ్యాపారులకు ఇవ్వడం మొదలెట్టారు. అయినా వ్యాపారం అనుకున్నంత స్థారుులో జరగకపోవ డంతో తాము తీసుకున్న రేటుకు కొంతమేర కలుపుకొని తక్కువకే విక్రరుుస్తున్నారు. ‘చిల్లర’దెబ్బ... నగర శివారుతో పాటు వివిధ జిల్లాల నుంచి టమాటా, వంకాయ, బెండ కాయ, సొర కాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ ఉత్పత్తి అవుతున్నారుు. కోటి జనాభా ఉన్న నగరానికి రోజూ ఒక్కొక్కరికి 350 గ్రాముల చొప్పున 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. హోల్‌సేల్ మార్కె ట్లకు 25 లక్షల కూరగాయలు వస్తున్నారుు. వేసవిలో పది లక్షల కిలోల వరకు నగరంలో కొరత ఉంటుందని, ఇప్పుడు ఆ స్థారుు ఇబ్బం ది లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతు న్నారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం వారం రోజులుగా మార్కెట్‌కు వచ్చే లోడ్లపై పడిందని, కొనుగోలుదారులు ఆశించిన స్థారుు లో రాకపోవడంతో తీసుకున్న సరుకు కుళ్లిపో తోంది. రైతుబజార్లలోనూ ఇదే పరిస్థితి. రూ.కోటి తగ్గిన అమ్మకాలు... నోటురద్దు దెబ్బకు బోయిన్పల్లి మార్కెట్ కుదేలరుుంది. రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగే ఈ మార్కెట్లో రాబడి ఒక్కసారిగి పడిపో రుుంది. దాదాపు కోటి మేరకు అమ్మకాలు పడి పోయాయి. గురువారం సాయంత్రం ఆరు గంటలకు క్యారెట్(గ్రేడ్ 1) పది కిలోలు రూ.70కి పడిపోరుుంది. వారం కిందట పది కిలోలు రూ.1,500కు విక్రరుుంచారు. కొనేవాళ్లు లేరు... బోయిన్పల్లి మార్కెట్ యార్డులో జరిగే కూరగాయల క్రయ, విక్రయాలతో నేరుగా సుమారు 2 వేల మందికి, పరోక్షంగా వేలాది మంది రైతులు, రైతు కూలీలకు ఉపాధి సమ కూరుతుంది. రాజధాని చుట్టూ ఉండే వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచీ నిత్యం వెరుు్యకి పైగా వాహనాల ద్వారా పెద్దఎత్తున కూరగాయలు మార్కెట్‌కు వస్తాయి. ఇక్కడి కమిషన్‌న్ ఏజెంట్ల మధ్య వర్తిత్వంతో వాటిని విక్రరుుస్తారు. రైతులకు నేరుగా నగదు అందజేస్తారు. అరుుతే పెద్ద నోట్ల రద్దుతో హోల్‌సేల్ కూరగాయ విక్రేతలు కొనుగోళ్లను భారీగా తగ్గించేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నగదు సమస్య కారణంగానే తాము క్రయ, విక్రయాలు చేయలేకపోతున్నా మంటున్నారు. దిగుబడి పెరిగినా తిప్పలే ఈసారి క్యారెట్ పంట దిగుబడి బాగా పెరిగింది. పదిరోజుల క్రితం వరకు రోజుకు 500 కిలోల వరకు మార్కెట్‌కు తరలిస్తే రూ.7వేల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం కేవలం రూ.3వేలే అందుతుంది. - పాండురంగారెడ్డి, షాబాద్ రోజురోజుకూ తగ్గుతోంది మార్కెట్లో నగదు కొరత తీవ్రంగా ఉం డటంతో రోజు రోజుకీ తక్కువ ధరకే అమ్ము కోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా చిల్లర సమస్యతో పదిరోజులుగా కిలోకు రోజుకు రూ.1 చొప్పున తక్కువ ధరకు అమ్ముకుం టూ ఉన్నాం. - శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల సగం కూలీనే దక్కుతోంది మార్కెట్లో సుమారు 800మంది హమాలీలు ఉన్నాం. చిల్లర లేని కారణంగా సేఠ్లు, రైతుల సమస్యను చూసి కొన్ని సందర్భాల్లో సగం కూలి రేట్లే ఇస్తున్నా సర్దుకోవాల్సి వస్తోంది. - సంపత్, మల్లేశ్(హమాలీలు) -
బీమాయే చేస్తే..
♦ ప్రమాదకరంగా మారుతున్న ‘మిస్ సెల్లింగ్’ ♦ ఆ మాయలో పడకుండా ముందు జాగ్రత్త అవసరం ♦ పాలసీలోని అంశాలు ముందే చూసుకోవాలి ♦ లేదంటే ఫ్రీ-లుక్ పీరియడ్‌లో రిటర్న్ చేయొచ్చు ♦ ఫ్రీ-లుక్ సమయం దాటితే మాత్రం అంతే సంగతి ఏజెంట్ ఏదో చెబుతాడు. ఫోన్లలో మార్కెటింగ్ ప్రతినిధులు మరేదో చెబుతారు. మొత్తానికి అంతా కలిసి మన అవసరానికి మేకప్ వేస్తారు. దానికి బోలెడన్ని హంగులు జోడిస్తారు. అందమైన ఇన్సూరెన్స్ పాలసీగా తయారు చేస్తారు. తీరా డబ్బులు కట్టి పాలసీ చేతిలోకి తీసుకున్నాక... అది మీ అవసరానికి సరిపోనిదైతే పరిస్థితేంటి? మీకు అక్కర్లేని ఏ పాలసీనో మీకు అంటగట్టి ఉంటే మీరేం చేయాలి? అలాంటి సమయాల్లో మీకున్న హక్కులేంటి? అసలు పాలసీ రద్దు చేసుకోవటానికి అవకాశం ఉందా? రద్దు చేసుకుంటే పాలసీకి కట్టిన సొమ్ము తిరిగి వెనక్కి వస్తుందా? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం... మనలో చాలామందికి బీమా పాలసీ తీసుకున్నాక... అరె! ఇదెందుకు తీసుకున్నామా? అని అనిపించే సందర్భం ఒక్కటైనా జరిగి ఉంటుంది. మనకు చెప్పినదానికన్నా ప్రీమియం ఎక్కువ కావటమో, లేక చె ప్పిన రీతిలో అంత ఎక్కువ సొమ్ము చేతికి రాకపోవటమో ఏదో ఒకటి జరగటం చూస్తూనే ఉన్నాం. దీన్నే బీమా పరిభాషలో ‘మిస్ సెల్లింగ్’గా వ్యవహరిస్తున్నారు. ఈ మిస్ సెల్లింగ్ అనేది ఇటీవల ఎంతలా పెరిగిపోయిందంటే... చివరకు ఐఆర్డీఏ కూడా దీన్ని ప్రస్తావించాల్సి వస్తోంది. అందుకే అక్కర్లేని పాలసీ తమకు అంటగట్టకుండా వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రీమియం చూసుకోవాలి ఎక్కువమంది చేసే ఫిర్యాదేమిటంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి గురించి. చాలామందికి అది ఒకేసారి చెల్లిస్తే సరిపోయే పాలసీ అని చెప్పటం... కానీ చివరికి పలుమార్లు ప్రీమియం చెల్లించాల్సి రావటం జరుగుతోంది. మరో ఫిర్యాదు... హోమ్లోన్తోనో, వ్యక్తిగత రుణంతోనో కలిపి ఇచ్చే బీమా పాలసీని సేవింగ్స్‌గా భావించకూడదు. అది టెర్మ్ పాలసీ. అంటే ఆ రుణం తీరేదాకానే దాని రక్షణ ఉంటుంది. అంతేతప్ప దాన్నుంచి మనకు చివరకు డబ్బులొస్తాయని మాత్రం ఆశించొద్దు. దీనిపై ఓ బీమా సంస్థ ఉన్నతాధికారిని సంప్రదించగా... ‘‘ఔను నిజమే! అందుకే మీరు చెల్లిస్తున్న ప్రీమియం, పాలసీ బాండ్లో పేర్కొన్న ప్రీమియం ఒకటేనా కాదా అనేది మొదట చూసుకోవాలి. అలాగే ఇల్లు వంటి ఆస్తి కొనుగోలు చేసేటపుడు దానికి రక్షణగా ఇచ్చే బీమా పాలసీని గమనించాలి. పొదుపు కోసమంటూ ఆ పాలసీకి అదనపు హంగులు జోడిస్తే తీసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక ఆస్తికి రక్షణగా బీమా తీసుకోవాలి తప్ప మరో ఆస్తి బీమా రూపంలో అక్కర్లేదు’’ అని వ్యాఖ్యానించారు. మెచ్యూరిటీ తేదీ, బీమా చేసిన వ్యక్తి వయసు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో పాలసీ తీసుకునేటపుడే చూసుకోవాలి. ఉదాహరణకు పాలసీ వ్యవధి పదేళ్లుగా ఉండి, పాలసీదారు వయసు 45 ఏళ్లనుకోండి. మెచ్యూరిటీ 60 ఏళ్లకు ఇస్తామనే షరతు ఉంటే.. ఆ పాలసీ క్లెయిమ్ చెల్లదు. కొన్నిసార్లు పాలసీదారు అడిగినదానికి బదులు తనకు కమిషన్ ఎక్కువగా వస్తుందనో, వైద్య పరీక్షలుండవనో ఏజెంట్ మరో పాలసీని ఇవ్వటం కొత్తేమీ కాదు. పాలసీదారు ఇది తెలుసుకునేటప్పటికే రెండుమూడు ప్రీమియంలు చెల్లించేసి ఉంటారు. అందుకని పాలసీ ఇల్లస్ట్రేషన్ చూడాలి. దాన్లో పాలసీ ఛార్జీలకింద ఎంత పోతాయో ఉంటుంది. దాన్నిబట్టి కమీషన్లు గట్రా ఎంతున్నాయో తెలిసిపోతుంది. మరీ ఎక్కువ ఛార్జీలుంటే మానేయొచ్చు. ‘‘పాలసీ పేరు, మీ వయసు, పాలసీ వ్యవధి మీ ఎదురుగానే నింపేలా చూసుకోవాలి. లేనిపక్షంలో ఫ్రీ-లుక్ పీరియడ్‌లో మీకొచ్చే వెరిఫికేషన్ కాల్లో అన్ని వివరాలూ చెక్ చేసుకోవాలి. అందుకే పాలసీ కాపీ, ఇల్లస్ట్రేషన్ కాపీ మీ దగ్గర ఉంచుకోవటం ముఖ్యం. మరో ముఖ్యమైన విషయమేంటంటే చాలామంది పన్ను ఆదా చేసుకోవటానికి బీమా తీసుకుంటారు. రూ.2,500 మిగులుతుందని రూ.25వేలు కడతారు. తీరా చూస్తే కవరేజీ ఏ 3 లక్షలకో ఉంటుంది. అదే డబ్బుతో రూ.2 కోట్ల బీమా పాలసీ తీసుకోవచ్చని వారు గుర్తించాలి’’ అనేది బీమా నిపుణుల సలహా. అందుకే ఈ విషయంలో పాలసీదారు- ఏజెంట్ మధ్య మాటల్లో తేడాలుండకూడదంటారు బిగ్ డెసిస్టన్స్ డాట్ కామ్ సీఈఓ మనీష్ షా. ‘‘అందుకే ఇపుడు చాలా బీమా కంపెనీలు సూటబిలిటీ మ్యాట్రిక్స్ ప్రొఫైల్‌ను వాడుతున్నాయి. దీంతో పాలసీదారు ప్రొఫైల్ తెలుస్తుంది. ఏజెంటు తనకు అవసరమైన బీమానే అమ్మాడా? లేదా? అన్నది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే అవసరానికి తగ్గ పాలసీనే ఏజెంటు విక్రయించాలి. అందుకోసం తను పాలసీదారును రకరకాల ప్రశ్నలడగాలి’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ వైస్ ప్రెసిడెంట్ సుజయ్ మన్నా చెప్పారు. పాలసీదారుకు పదేళ్ల తరవాత డబ్బు అవసరమయ్యే పక్షంలో ఏజెంటు ఐదేళ్ల వ్యవధి గల పాలసీ అమ్మటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మనం తీసుకుంటున్న పాలసీపై సరైన అవగాహన లేనపుడు ఎవరో ఒకరిని పాలసీ తీసుకునే ముందు సంప్రదించటం ఉత్తమమని చెప్పారాయన. ఫ్రీ-లుక్ పీరియడ్‌ను మర్చిపోవద్దు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ... పాలసీదార్లు మోసపోకుండా ఉండేందుకు ఫ్రీ-లుక్ పీరియడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ పాలసీ కవరేజీ ఆరంభమైన 15 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఈ సమయంలో గనక మీకు అక్కర్లేని పాలసీ ఇచ్చారని భావించినా, వ్యవధి- ప్రీమియం సహా ఏ అంశంలోనైనా మిమ్మల్ని మోసం చేశారని గ్రహించినా ఆ పాలసీని వెనక్కి తిరిగి ఇచ్చేయొచ్చు. అలా ఇచ్చేస్తే మీరు మెచ్యూరిటీ వరకూ దాన్ని కట్టాల్సిన బాధ తప్పటమే కాదు. మీరు చెల్లించిన సొమ్ము కూడా మీకు తిరిగి వచ్చేస్తుంది. ఖర్చుల కోసం నామమాత్రపు మొత్తాన్ని మాత్రం మినహాయించుకుంటారు. ఈ 15 రోజలు దాటితే మాత్రం మీరు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదని గుర్తుంచుకోవాలి. అందుకే మోసంతో అంటగట్టిన పాలసీలు వెనక్కి ఇవ్వకుండా పాలసీదారును తొలి 15-20 రోజుల పాటు మాయమాటలతో మభ్యపెడుతూనే ఉంటాయి దాన్ని విక్రయించిన ఏజెన్సీలు. తస్మాత్ జాగ్రత్త!!. గ్రేస్ రాజాకు జరిగిన మోసమిది... ఇది రెండు నెలల కిందట జరిగిన వ్యవహారం. హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న గ్రేస్రాజాకు ఒకరోజు ఫోనొచ్చింది. అవతలి నుంచి ఓ బీమా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌నంటూ పరిచయం చేసుకుంది ఓ అమ్మాయి. ప్రస్తుతం ఓ ఆఫర్ నడుస్తోందని, బీమా పాలసీ తీసుకుంటే 32 అంగుళాల ఎల్ఈడీ టీవీ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. తను మొదట నమ్మలేదు. మళ్లీ ఫోన్ చేసి... తమ టార్గెట్ గడువు ముగుస్తోందని, అందుకే ఇలా ఇస్తున్నామని నమ్మబలికింది. తరవాత వాళ్ల మేనేజరు, మరో ఎగ్జిక్యూటివ్ కూడా ఫోన్ చేసి ఇదే చెప్పటంతో తను నమ్మాడు. తను ఓకే అనటంతో సోమాజిగూడలోని మరో ఏజెన్సీ రంగంలోకి దిగింది. అంతా నిజమేననుకున్నాడు. ఫలితం... భారీ ప్రీమియంతో తనకు అక్కరకు రాని ఓ పాలసీని అంటగట్టారు. పెపైచ్చు చేతికి పాలసీ వచ్చింది తప్ప టీవీ రాలేదు. వాళ్ల కాల్స్ రికార్డు కూడా చేసిన గ్రేస్రాజా... ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. నిజానికి ఏ పాలసీకైనా 15 రోజుల పాటు ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో గనక తను అడిగిన పాలసీ ఇవ్వలేదని గ్రహిస్తే దాన్ని వెనక్కిచ్చేసే అవకాశం ఉంటుంది. గ్రేస్రాజా అదే చేద్దామనుకున్నాడు. కానీ సదరు ఏజెన్సీ... అదిగో టీవీ వస్తోంది, ట్రాన్స్‌పోర్ట్‌లో ఉంది... మీ భార్య బర్త్‌డే రోజు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాం.. అంటూ రకరకాల కథలు చెప్పింది. ఇంతలో ఫ్రీ-లుక్ పీరియడ్ ముగిసింది. ఏజెన్సీ ప్రతినిధులు ముఖం చాటేశారు. ఎవరికి చెప్పినా, కాల్ రికార్డులతో సహా ఫిర్యాదు చేసినా నో యాక్షన్. మరో చిత్రమేంటంటే సోమాజిగూడలోని సదరు అసోసియేట్స్ పేరు ఒక్కసారి నెట్లో సెర్చ్ చేసి చూస్తే... వారి చేతిలో తామూ మోసపోయామంటూ వందల కొద్దీ ఫిర్యాదులు. ఇవన్నీ చూసి గ్రేస్ రాజాకు మతిపోయినంత పనయింది. ఈ ఒక్క ఏజెన్సీ నిర్వాకంతో తనకు బీమా వ్యవస్థమీదే నమ్మకం పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
ధాన్యం సేకరణ ఇక సమష్టి బాధ్యత
ఏలూరు : నూతన లెవీ విధానం అమలుకు యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోం ది. ధాన్యం సేకరణ విషయంలో అధికారులు, మిల్లర్లు, ఐకేపీ సభ్యులు సమష్టి బాధ్యత వహించాలని కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా సమన్వయక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాలు, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు, మిల్లర్లు, ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) సభ్యులను ఉద్దేశించి కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోగా సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బం దులు పడకుండా పటిష్ట ప్రణాళిక అమ లు చేయూలని, ధాన్యం సేకరణ విధానంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరా క్రాంతిపథం సభ్యులు, పౌర సరఫరాలు, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఏఏ గ్రామాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, గ్రామాలవారీగా ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై సమగ్ర సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేయూలన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు అధికారుల బృందం ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపుల తీరును పరిశీలించేందుకు పౌర సరఫరాలు, డీఆర్డీఏ, రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారుల బృందాన్ని ఛత్తీస్‌గఢ్ పంపిస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లల్లో ఖరీఫ్ సాగవుతోందని, సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లతోపాటు సహకార సంఘాల ద్వారా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు కేటాయించిన మేరకు లెవీ సేకరణ చేపడతామన్నారు. పౌర సరఫరాల సంస్థ, రైస్‌మిల్లర్ల సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ కేవీఆర్ రాజు, డీఎస్వో డి.శివశంకరరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ పులి శ్రీరాములు పాల్గొన్నారు.