తుపాను ప్రభావంతో గ్రేటర్‌లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
సాక్షి, సిటీబ్యూరో: తుపాను ప్రభావంతో గ్రేటర్‌లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, పాతనగరం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తింది.
ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇళ్లకు చేరే వేళ ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8.30 వరకు 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు.