
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతాం: బొత్స
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనే కాదు సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం హైదరాబాద్లో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవి చూస్తుందని వెల్లడించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో కొన్ని తప్పులు దొర్లాయని.... వాటికి సమిష్టి బాధ్యతగా ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలిపారు.
సీమాంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయా పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో100 రోజుల్లో అమలు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. రేపు అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చిన హామీల అమలు జరిపేందుకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని బొత్స ఈ సందర్బంగా స్ఫష్టం చేశారు.