తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంతో జార్ఖండ్, ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకొని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. చత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఈ అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో.. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగురాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.